Namaste NRI

రైటర్ పద్మభూషణ్ కు సూపర్ స్టార్ ప్రశంసలు

సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా రైటర్ పద్మభూషణ్. ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిలింస్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మాతలు. షణ్ముక్ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రాన్ని మహేష్ బాబు వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సకుటుంబంగా ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే చిత్రమిది. నేను ఆద్యంతం మూవీని ఆస్వాదించాను. ముఖ్యంగా క్లైమాక్స్  బాగా ఆకట్టుకుంది. సుహాస్ నటన నచ్చింది. చిత్ర బృందానికి నా ప్రశంసలు చెబుతున్నా అన్నారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు  దర్శక నిర్మాతలతో పాటు సుహాస్ హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events