Skip to main content

Namaste NRI

వసంత కోకిల ట్రైలర్ ను విడుదల చేసిన మెగాస్టార్

బాబీ సింహా హీరోగా నటిస్తున్న చిత్రం వసంత కోకిల. బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా  నటిస్తోంది. రమణన్ దర్శకుడు. రజనీ తాళ్లూరి, రేష్మి సింహా నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్‌ను  అగ్ర నటుడు చిరంజీవి విడుదల చేశారు. 40 ఏళ్ల క్రితం కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ టైటిల్ వసంతకోకిల తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. దర్శకుడు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌, సాంగ్స్‌కు  మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ కూడా అందర్ని అలరించే విధంగా వుంది. ప్రేమకథకు సస్పెన్స్ ఎలిమెంట్ జతచేసి రూపొందించిన చిత్రమిది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబీ  సింహా రుద్ర పాత్రలో నటిస్తున్నాడు. నటుడు ఆర్య ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపిస్తాడు. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, భాషల్లో విడుదల చేస్తున్నాం  అన్నారు.

Social Share Spread Message

Latest News