Skip to main content

Namaste NRI

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్.. ప్రగతి పథంలో రాష్ట్రం

రాష్ట్ర బ‌డ్జెట్ 2023-24ను శాసనసభలో శ్రీ హరీష్ రావు శాసన మండలిలో శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. అంతకుముందు బడ్జెట్ ప్ర‌తుల‌ను శాసనసభ ప్రాంగణంలోని సీఎం ఛాంబర్ లో సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు మంత్రులు, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ శ్రీ రామకృష్ణ రావు అందజేశారు.  2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ₹2,90,396 కోట్ల‌తో తెలంగాణ వార్షిక బ‌డ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి.

వైద్య ప్రగతి

దేశంలో అత్యుత్తమ వైద్యసేవలందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది. మారుమూల ప్రాంతాలకు వైద్య విద్యను, వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం స్థాపించనున్నది.

పట్టణ ప్రగతి

రోజురోజుకూ పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం విశేషంగా దృష్టి సారించింది. ‘పట్టణ ప్రగతి’ ద్వారా పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం మరియు మెరుగైన పౌర సేవలు అందిస్తున్నది.

పల్లె ప్రగతి

పల్లె ప్రగతి’ గ్రామాలను సకల మౌలిక వసతులు, పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడేలా చేస్తున్నది. గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కావాల్సిన సాధనాలన్నింటినీ సమకూర్చింది. దీంతో రాష్ట్రంలోని 12,769 పల్లెలు అద్భుత ప్రగతిని సాధించాయి.

రైతు ప్రగతి

రైతన్నలకు చార్జీలు లేకుండా కరెంటు, పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల నేడు దేశ వ్యవసాయ వృద్ధిరేటు కంటే తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు దాదాపు రెండు రెట్లు అధికంగా ఉంది.

విద్యా ప్రగతి

తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభ విద్యా ప్రగతి. తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. పాఠశాల విద్యతో మొదలుకొని విశ్వవిద్యాలయాల స్థాయి వరకు పటిష్టమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది.

దక్షిణాది రాష్ట్రాల్లో రికార్డు

2017-18 నుంచి 2021-22 మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయ వృద్ధి రేటు (11.8%) నమోదు చేసి తెలంగాణ రికార్డు సృష్టించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ప్రతీ ఏడూ రాష్ట్ర జిఎస్డీపి వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువగా నమోదవుతూ వస్తున్నది.

Social Share Spread Message

Latest News