Namaste NRI

ఆసక్తిరేకెత్తిస్తున్న ధనుష్ సార్ మూవీ ట్రైలర్

ధనుష్  హీరోగా నటిస్తున్న చిత్రం సార్. ధ‌నుష్‌కు  జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్‌గా  నటించింది.  దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్టైన‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు  ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమాపై ఎక్కడలేని బజ్ తెచ్చిపెట్టాయి. కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను  రిలీజ్ చేసింది. లేటెస్ట్‌గా  రిలీజైన ట్రయిలర్ ఆసక్తి రేకెత్తిస్తుంది. ధనుష్ యాక్షన్‌తో  అదరగొడుతున్నాడు. సంయుక్త మీనన్‌తో  లవ్ ట్రాక్ బాగుంది. చాలా రోజుల తర్వాత ఆదికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

ఇప్పటికే రిలీజైన మాస్టారు మాస్టార, బంజార పాటలకు విశేష స్పందన వచ్చింది.  సముద్రఖని మరోసారి తన విలనిజంతో ఆకట్టుక్కోడానికి సిద్ధమయ్యాడు. ముఖ్యంగా జీవి. ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తుంది. సితార సంస్థ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రూపొందిచినట్లు విజువల్స్ చూస్తే తెలుస్తుంది.  ఈ చిత్రాన్ని జీవి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

Social Share Spread Message

Latest News