Namaste NRI

ఈ పోరులో ఇతర దేశాల కూడా సాయం చేయాలి

రష్యాపై పోరులో తమకు మరింతగా సైనిక సాయం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ  యూరోపియన్ యూనియన్ (ఇయూ)ను అభ్యర్థించారు. జెలెన్‌స్కీ  ఇయూ పార్లమెంట్‌ను  ఉద్ధేశించి ప్రసంగించారు. రష్యా పై పోరు కేవలం తమ దేశానిదే కాదని, ఇతరత్రా యూరప్ దేశాలు కూడా ఈ ఘర్షణలో పాలుపంచుకోవల్సి ఉంటుందని, కలిసికట్టుగా వ్యవహరించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. రష్యా ప్రపంచంలోనే అతి తీవ్రమైన యూరప్ వ్యతిరేక శక్తి అని తెలిపారు. ప్రసంగం తరువాత జెలెన్‌స్కీ  ఇయూ జెండాను పట్టుకుని నిలబడ్డారు. ఈ దశలో మొత్తం పార్లమెంట్ మౌనంగా ఉండి, ఉక్రెయిన్‌కు  సంఘీభావం ప్రకటించింది. ఈ దశలోనే ఉక్రెయిన్ జాతీయ గీతం ఆలాపన జరిగింది. ఇయూ ఎంపిలను ఉద్ధేశించి జెలెన్‌స్కీ  చేసిన ప్రసంగానికి ముందు మధ్యమధ్యలో తరువాత కూడా పలుసార్లు సభికుల నుంచి హర్షధ్వానాలు వెలువడ్డాయి. తాము ఒక్కరిమే రష్యాతో పోరు చేయడం కత్తిమీద సాము అవుతుందని, ఇతర దేశాల నుంచి కూడా తగు సాయం అవసరం ఉంటుందని జెలెన్‌స్కీ  తెలిపారు. ప్రత్యేకించి ఇతర దేశాల నుంచి తమకు సైనిక ఆయుధ సాయం అత్యవసరం అని, ఇది సకాలంలో తక్షణం స్పందించి చేయాల్సిన సాయం అని జెలెన్‌స్కీ  తెలిపారు.

Social Share Spread Message

Latest News