సమంత ప్రధాన పాత్రలో నటించిన ఇతిహాసిక నేపథ్య సినిమా శాకుంతలం. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇతర పాత్రలను మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, మధుబాల, గౌతమి తదితరులు పోషించారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ చేశాయి. కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తామని వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.














