Namaste NRI

ఈ సినిమా నేటి యువతకు మంచి సందేశం

సోహైల్, మృణాళిని జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఆర్గానిక్ మామ-హైబ్రీడ్ అల్లుడు. రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కోనేరు కల్పన నిర్మాత. ఈ చిత్రంలోని  నమ్ముకోరా నమ్ముకోరా అంటూ సాగే సెకండ్ సింగిల్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతాన్ని రేవంత్ ఆలపించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇదొక యూత్‌ఫుల్‌  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.  ఆద్యంతం చక్కటి వినోదాన్ని పంచుతుంది. ఈ సినిమా కోసం తొలిసారి సంభాషణలు రాశాను. రాజేంద్రప్రసాద్, మీనా నటన ప్రధానాకర్షణగా నిలుస్తుంది అన్నారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారని, తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ  పొందుతారని అన్నారు.  చిత్ర సమర్పకుడు కె.అచ్చిరెడ్డి  మాట్లాడుతూ కృష్ణారెడ్డిగారి సినిమాల్లో ఫ్యామిలీ డ్రామాతో పాటు చక్కటి మెసేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నేటి యువతకు మంచి సందేశాన్నిచ్చాం. యూత్ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ పాటను ప్రత్యేకంగా రాయించాం. మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలిపారు.  

Social Share Spread Message

Latest News