Namaste NRI

భోళాశంకర్ సెట్‌లో దర్శకేంద్రుడు

చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళా శంకర్. చిరుకు జోడీగా తమన్నా నటిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఏకే ఎంటర్‌టైనమెంట్స్, క్రియేటీవ్ కమర్షియల్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా  తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాలం కు రీమేక్‌గా  తెరకెక్కుతుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా భోళా శంకర్ సెట్లోకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెళ్లాడు.  ప్రస్తుతం చిత్రయూనిట్ కోల్‌కత్తా  నేపథ్యంలో సాగే ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. కాగా షూటింగ్ జరుగుతున్న సెట్స్‌కు  రాఘవేంద్రరావు వెళ్లాడు. అనంతరం మాట్లాడుతూ నేను చూడాలని వుంది సెట్స్ కు కూడా వెళ్ళాను. అప్పుడు రామ్మా చిలకమ్మా సాంగ్ తీస్తున్నారు. అది కూడా కోల్‌కత్తా  నేపథ్యంలో సాగింది. ఇప్పుడు ఈ సాంగ్ షూటింగ్ చూస్తుంటే ఆ పాట జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ పాటలా ఈ పాట కూడా చార్ట్ బస్టర్ అవుతుంది. అదే విధంగా సినిమా కూడా బ్లాక్‌బస్టర్‌ సాధిస్తుందని చెప్పాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి సమ్మర్‌లో  రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో పోస్ట్ పోన్ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events