Namaste NRI

వీర శూర మహంకాళి వస్తోందయ్యా.. అంటున్న కోనసీమ థగ్స్

హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం కోనసీమ థగ్స్. మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో రియా షిబు, హెచ్ఆర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వీడియో సాంగ్‌ను  విడుదల చేసింది చిత్రబృందం. సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  నిర్మాత మాట్లాడుతూ పాన్ ఇండియా లెవల్‌లో  నిర్మిస్తున్న ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో  జరిగే ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఉత్కంఠను పంచుతుంది. అమ్మవారు కాళికా రూపంలో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం బ్యాక్‌డ్రాప్‌లో  పాటను విడుదల చేశాం. వీర శూర మహంకాళి వస్తోందయ్యా..వేటాడను ఆ తల్లే వస్తోందయ్యా అంటూ సాగే ఈ పాట చిత్రంలో కీలక సన్నివేశంలో రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రం విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events