తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటిస్తున్న చిత్రం మాధవే మధుసూదనా. సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. జయ ప్రకాష్, సుమన్, బొమ్మదేవర రామచంద్రరావు, శైలజా ప్రియ, నవీన్ నేని, విజయ్ మాస్టర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను అగ్ర నటుడు అక్కినేని నాగార్జున విడుదల చేశారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ బాగుందని, అందరినీ మెప్పించేలా ఉందని ప్రశంసించారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా ఓ అందమైన ప్రేమకథను ఆవిష్కరించబోతున్నాం. వికాస్ బాడిస అందించిన సంగీతం మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: వికాస్ బాడిస, పాటలు: శ్రీమణి, అనంతశ్రీరామ్, విరించి పుట్ల, మాటలు: బి.సుదర్శన్, నిర్మాత, రచన, దర్శకత్వం: బొమ్మదేవర రామచంద్రరావు.














