Skip to main content

Namaste NRI

ఆర్‌ఆర్‌ఆర్‌ మరో ఘనత

దేశంలోనే కాదు అంతర్జాతీయ వేదికలపైనా సత్తా చాటుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మరో ఘనత దక్కించుకుంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషన్‌ అవార్డులను గెలుచుకున్న ట్రిపుల్‌ఆర్‌ ఇప్పుడు ఆస్కార్‌పై కన్నేసింది. ఓరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. ఈ వేడుక మార్చి 12న ఘనంగా జరుగనుండగా నాటు నాటు పాటను లైవ్ లో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆస్కార్‌ అకాడమీ నిర్వాహకులు ట్వీట్‌ చేశారు. మార్చి 12న జరిగే ఆస్కార్‌ వేడుకలో సింగర్స్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఈ పాటకు లైవ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇస్తారని అకాడమీ వెల్లడించింది. దీంతో తెలుగు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్‌ వంటి గొప్ప వేదికపై మనవాళ్లు లైఫ్‌ ప్రదర్శన ఇవ్వడం నిజంగా తెలుగు వారందరికీ గర్వకారణం. ఈ విషయంపై సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని సందర్భం అని, ఆ క్షణాల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నానని  ట్వీట్‌ చేశారు. దీంతో తెలుగు సినీ ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు.

Social Share Spread Message

Latest News