Namaste NRI

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఫస్ట్ లుక్ అదిరింది!

నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటిస్తున్న చిత్రానికి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి  అనే టైటిల్‌ను  ఖరారు చేశారు. పి.మహేష్ బాబు దర్శకుడు.  ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్‌గా  నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రంలో చెఫ్ అన్విత రవళి పాత్రలో అనుష్క కనిపించనుంది.  రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా  తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతున్నది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా తెరపైకి రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నీరవ్ షా, సంగీతం : రధన్.

Social Share Spread Message

Latest News