Skip to main content

Namaste NRI

అగ్ని నక్షత్రంలోని తెలుసా తెలుసా అనే పాటను విడుదల చేసిన సమంత

మంచు మోహన్‌బాబు,  మంచు లక్ష్మీ ప్రసన్న ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం అగ్ని నక్షత్రం. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు,  మంచు లక్ష్మీ నిర్మించారు. ఈ సినిమాలోని తెలుసా తెలుసా అనే పాటను ఉమెన్స్ డే సందర్భంగా హీరోయిన్ సమంత సోషల్‌మీడియా  ద్వారా విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పాటలో లక్ష్మీ ప్రసన్నతో పాటు ఆమె తనయ విద్యా నిర్వాణ కూడా కనువిందు చేయడం విశేషం. మలయాళ నటుడు సిద్ధిక్, హీరో విశ్వంత్, చైత్ర శుక్ల ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించనున్నారు.   ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. మధు రెడ్డి ఎడిటర్‌గా  వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News