Skip to main content

Namaste NRI

మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే  డా.ఎం.సంజయ్ కుమార్

బిఅర్ఎస్ ఎన్ఆర్ఐ, తెలుగు కళా సమితి, భారత జాగృతి ఆధ్వర్యంలో బహ్రెయిన్‌లోని  అడ్లియలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే  డా. ఎం. సంజయ్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ఆర్ఐ  మిత్రులతో పలు అంశాల గురించి చర్చించారు. నియోజకవర్గ పరిధిలో వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్ఆర్ఐ  సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాల గురించి వివరించారు. అనంతరం తెలుగు కళా సమితి, బిఅర్ఎస్ ఎన్ఆర్ఐ, భారత జాగృతి శాక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌ను  దుశ్వాలువా కప్పి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ భారత్ జాగృతి ప్రెసిడెంట్ చెలం శెట్టి హరిప్రసాద్, తెలుగు కళ సమితి అధ్యక్షుడు హరి బాబు, ఎన్ఆర్ఐ &  బిఅర్ఎస్ సెల్  అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్,  హనుమంతరావు, సతీష్ కుమార్, మురళి, హరిప్రసాద్, పనిభూషణ్ రెడ్డి, వంశీ,విజేందర్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events