Namaste NRI

నిర్మాత అభిషేక్ అగర్వాల్ చేతుల మీదుగా అరి మూవీ ట్రైలర్ విడుదల

అనసూయ, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా అరి. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. జయశంకర్ దర్శకుడు. ట్రైలర్‌ను  నిర్మాత అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న ఆయన ఇలాంటి వైవిధ్యమైన కథాంశంతో తొలి సినిమా నిర్మించిన నిర్మాతలను అభినందించారు.దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ క్యారెక్టర్ లుక్స్, పాటలకు మంచి స్పందన వస్తున్నది. ట్రైలర్ కూడా ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాం. ఓ సరికొత్త కథతో, వైవిధ్యమైన పాత్రలతో సినిమాను రూపొందించాం  అన్నారు.

ఈ సినిమాలో  శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, తమిళ బిగ్ బాస్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్ తదితరులు నటించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.   రచన ఉదర్శకత్వం :జయశంకర్, సమర్పణ : ఆర్ వీ రెడ్డి, నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి , శేషు మారం రెడ్డి , సంగీతం : అనుప్ రూబెన్స్ , ఎడిటర్ : జి. అవినాష్ , సాహిత్యం : కాసర్ల శ్యాం , వనమాలి, కొరియోగ్రఫీ – భాను, జీతు, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ , స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సినిమాటోగ్రఫీ : శివశంకర వరప్రసాద్, పీఆర్వో – జీఎస్కే మీడియా

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events