Skip to main content

Namaste NRI

మీటర్ నుంచి చమక్ చమక్ పోరి

యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం మీటర్. రమేష్ కాదూరి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌  పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి చమక్ చమక్ పోరి.. బాలాజీ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందించగా అరణ్ కౌండిన్య, ఎంఎల్ గాయత్రి పాడారు.  హైదరాబాద్‌లోని  ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లోని  సంధ్య 70 ఎంఎంలో భారీ జనసందోహం సమక్షంలో ఈ పాటను గ్రాండ్‌గా  లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో  కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ పాట ప్రదర్శిస్తున్నప్పుడు మీ ఉత్సాహం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ సాంగ్‌లోని  ఎనర్జీ ఆకట్టుకుంటుంది. నా కెరీర్‌లో  ఓ భారీ సెట్‌లో  చేసిన పాట ఇది. సినిమా ఆద్యంతం వినోదాన్ని అందిస్తుంది  అని అన్నారు.  నిర్మాత చెర్రీ మాట్లాడుతూ టీజర్ చూశారు, పాట చూశారు. మీటర్ లో మ్యాటర్ ఉందని మీకు అర్థమై ఉంటుంది. అందమైన సెట్‌లో  ఈ పాట పిక్చరైజ్ చేశాం. భాను కొరియోగ్రఫీ చేశారు. కిరణ్ చేసిన మాస్ స్టెప్పులు ఆకట్టుకుంటాయి. సినిమాలో ఈ పాట ఆకర్షణ అవుతుంది. అన్నారు. ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రమేష్, సాయి కార్తిక్ పాల్గొన్నారు.  

Social Share Spread Message

Latest News