Namaste NRI

పుతిన్‌ కు షాక్‌.. అరెస్ట్ వారెంట్

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కు షాక్‌. ది హేగ్‌లోని ఇంటర్నేష‌న‌ల్ క్రిమిన‌ల్ కోర్టు (ఐసీసీ) అత‌నిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్‌లో జ‌రుగుతున్న‌యుద్ధానికి పుతిన్ బాధ్యుడు. అంతేకాదు ఆ దేశంలో ఆక్ర‌మించుకున్న ప్రాంతాల నుంచి అక్క‌డి ప్ర‌జ‌ల‌ను, ముఖ్యంగా పిల్ల‌ల‌ను ర‌ష్యాకు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న యుద్ధ నేరస్థుడు పుతిన్ అంటూ ఐసీసీ తన అరెస్ట్ వారెంట్‌లో పేర్కొంది. ఉక్రెయిన్ పిల్ల‌ల‌ను అక్ర‌మంగా ర‌ష్యాకు త‌ర‌లిస్తున్నందుకు ర‌ష్యా పిల్ల‌ల హ‌క్కుల క‌మిష‌న‌ర్ మ‌రియా అలెక్సేఎవ్నా వోవా బెలోవాపై కూడా ఐసీసీ న్యాయ‌మూర్తులు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు.

 అంతేకాదు ఉక్రెయిన్‌లో జ‌రుగుతున్న న‌ర‌మేధానికి ర‌ష్యా అధ్యక్షుడే కార‌ణం అన‌డానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయ‌ని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం తెలిపింది.ఇంట‌ర్నేష‌నల్ క్రిమిన‌ల్ కోర్టు మొద‌ట‌గా పుతిన్, మ‌రియాపై ర‌హ‌స్యంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయాల‌నుకుంది. అయితే.. వాళ్ల‌పై బ‌హిరంగంగా అరెస్ట్ వారెంట్ ఇస్తే, మ‌రిన్ని నేరాల‌ను అదుపులో పెట్ట‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు న్యాయ‌మూర్తులు వెల్ల‌డించారు. రష్యాలోని బాలల హక్కుల కమిషనర్‌ మారియా ల్వోవా బెలోవాకు కూడా వారంట్‌ జారీ చేసింది. దీనిపై రష్యా స్పందించింది. వారంట్‌ జారీచేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది.

Social Share Spread Message

Latest News