ఫేస్బుక్లో కి మళ్లీ డోనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన యూట్యూబ్ అకౌంట్‌ను కూడా మళ్లీ స్టార్ట్ చేశారు. రెండేళ్ల క్రితం క్యాపిటల్ హిల్ పై దాడి జరిగిన తర్వాత, ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ అకౌంట్లను మళ్లీ ఓపెన్ చేశారు. ఇక తన తొలి పోస్టును చేశారాయన. ఐయామ్ బ్యాక్ అంటూ ఫేస్బుక్లో ఫస్ట్ పోస్టు పెట్టారు. 12 సెకండ్ల వీడియో క్లిప్‌లో ఆయన 2016లో అధ్యక్ష ఎన్నికల్లో విజయం తర్వాత ఇచ్చిన విక్టరీ సందేశం ఉంది. అయితే ఇన్నాళ్లూ వెయిటింగ్లో పెట్టినందుకు అభిమానులకు ఆయన సారీ చెప్పారు. ట్రంప్ కు ఫేస్బుక్లో 34 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.















