ట్విట్టర్ సంస్థను నడపడం బాధాకరంగా ఉన్నట్లు ఎలన్ మస్క్ అన్నారు. ఈ సందర్భంగా మస్క్ మాట్లాడుతూ ఒకవేళ ఎవరైనా సరైన వ్యక్తి వస్తే ఆ సంస్థను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్ల డాలర్లకు ట్విట్టర్ సంస్థను మస్క్ కొన్న విషయం తెలిసిందే. అయితే కంపెనీని నడిపిస్తున్న తీరును ఆయన సమర్ధించుకున్నారు. బోరింగ్‌గా లేదని, కానీ ఒడిదిడుకులతో సాగుతున్నట్లు చెప్పారు. గత కొన్నాళ్ల నుంచి వత్తిడి ఉందని, అయినా కంపెనీని కొనుగోలు చేయడాన్ని ఆయన సమర్ధించుకున్నారు. తాను వచ్చిన తర్వాత కంపెనీని వీడిన అడ్వర్టైజర్లు.. ఇప్పుడు మళ్లీ కంపెనీలో చేరుతున్నారన్నారు. ట్విట్టర్ కంపెనీ బ్రేక్ఈవెన్ దశలో ఉందని, రాబోయే క్వార్టర్ వరకు క్యాష్ రిచ్ కానున్నట్లు చెప్పారు.