ట్విట్టర్ అకౌంట్‌లకు బ్లూ టిక్ కోల్పోయిన పలువురు ప్రముఖులకు మళ్లీ బ్లూ టిక్ వచ్చింది. 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న వారు ఫీజు చెల్లించకపోయినా బ్లూ టిక్ ఇవ్వాలని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ నిర్ణయించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్ బ్లూ టిక్ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించి సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలని రూల్ పెట్టారు. ఈ సర్వీసు పొందని వారికి ఏప్రిల్ 20న బ్లూ టిక్‌లు తీసేశారు. ఇప్పుడు 10 లక్షల మంది ఫాలోయర్లు ఉన్న వారికి బ్లూ టిక్‌లు పునరుద్ధరించారు.