మెటా కంపెనీకి రికార్డు స్థాయిలో జరిమానా పడింది. యురోపియన్ యూనియన్ యూజర్లకు చెందిన ఫేస్‌బుక్ డేటాను, అమెరికాలోని సర్వర్లకు అక్రమంగా బదిలీ చేసిన నేపథ్యంలో యురోపియన్ రెగ్యులేటర్లు మెటా కంపెనీకి ఫైన్ విధించారు. ఈ కేసులో 130 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఫేస్‌బుక్‌పై నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా ఈ ఫైన్ వేశారు. యురోప్‌లో ఉండే డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం ఆ జరిమానా విధించారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ కలిగి ఉన్న మెటా సంస్థ యురోప్ వేసిన జరిమానాపై కోర్టుకు వెళ్లనున్నది. అయితే ప్రస్తుతం యురోప్‌లో ఫేస్‌బుక్ సేవల్లో ఎటువంటి అంతరాయం ఉండదని ఆ కంపెనీ వెల్లడించింది. యురోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.