Skip to main content

Namaste NRI

ఆర్‌ఆర్‌ఆర్‌ స్కాట్‌ ఇకలేరు

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో గవర్నర్‌ స్కాట్‌ పాత్రలో నటించిన బ్రిటీష్‌ నటుడు రే స్టీవెన్‌సన్‌ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 58 ఏండ్లు. ఇటలీలో  కాసినో ఇన్‌ ఇస్చియా సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న ఆయన అక్కడే మృతి చెందారు. రే మరణానికి కారణాలు వెల్లడి కాలేదు. రే స్టీవెన్‌సన్‌ మృతికి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, దర్శకుడు రాజమౌళి తమ సంతాపాలు తెలియజేశారు.

దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ రే స్టీవెన్‌సన్‌ మృతి వార్త షాక్‌కు గురిచేసింది. ఆయన మరణవార్తను నమ్మలేకపోతున్నా. తన ఉత్సాహంతో మా అందరిలోనూ జోష్‌ నింపేవారు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎంతో ఆస్వాదించాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాఅన్నారు. రామ్‌ చరణ్‌ రే స్టీవెన్‌సన్‌ మృతిచెందడం బాధాకరం. మా స్కాట్‌ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరెప్పటికీ మాకు గుర్తుంటారు అని చెప్పారు. ఎన్టీఆర్‌ స్పందిస్తూ రే స్టీవెన్‌సన్‌ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన చాలా త్వరగా మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. రేతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతిని అందించింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు.

 ఇటలీలో ఇస్చియా ద్వీపకల్పంలో క్యాసినో అనే మూవీ చిత్రీకరిస్తుండగా రే అనుకోని ఇల్‌నెస్‌కు గురయ్యారు. దీంతో రేను వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చి చిక్సిత్స అందించారు. అయినప్పకీ ఫలితం లేకపోయింది.

Social Share Spread Message

Latest News