రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ఈగిల్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ప్రకటిస్తూ, వీ డియో గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో హీరో పాత్రలో రవితేజను చిత్రకారుడు, రైతు వంటి వివిధ వృత్తులకు సంబంధించిన వ్యక్తిగా చూపించారు. అతని కోసం భారత గూఢచార సంస్థ ఎందుకు వేట సాగిస్తున్నది? అనేది ఆసక్తికరంగా ఉంది. ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? అని నాయిక అనుపమ చెప్పిన డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


