కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాషింగ్టన్ నుండి న్యూయార్క్ వరకు ట్రక్కులో ప్రయాణించారు. తల్జిందర్ సింగ్ అనే డ్రైవర్‌తో కలిసి ట్రక్కులో ట్రావెల్ చేశారు రాహుల్. ట్రక్కు డ్రైవర్లు ఎలా పని చేస్తారు. ట్రక్కు ఫీచర్లు ఏమిటి. వారికి చలాన్లు పడతాయా.వేగ పరిమితి ఎంత. డ్రైవర్లు ఎంత ఆదాయం సంపాదిస్తారు? వంటి విషయాలను తన ప్రయాణంలో రాహుల్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ డ్రైవర్లు నెలకు రూ.8 లక్షల దాకా సంపాదిస్తారని తెలిసి ఆశ్చర్యపోయారు రాహుల్ గాంధీ.

తర్వాత డ్రైవర్ తల్జిందర్ ఏదైనా పాట వినిపించనా అని అడిగినప్పుడు ఏదైనా సరే అని రాహుల్ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధూ మూసేవాలా పాట పెట్టమంటారా అని అడగ్గా 295 సాంగ్‌ను ప్లే చేయమని రాహుల్ కోరారు. ట్రక్కును ఓ రెస్టారెంట్ వద్ద ఆపారు. రాహుల్ రెస్టారెంట్ లోకి వెళ్లి వారిని పలకరించారు. అందరితో కలిసి ఫొటోలు దిగారు. కొంచెం ఆహారం తిని ట్రక్కు డ్రైవర్‌కు వీడ్కోలు పలికారు. రాహుల్ గాంధీ గత నెలలోనూ ఢిల్లీ నుంచి చండీగఢ్ ప్రయాణి వరకూ ట్రక్కులో ప్రయాణించారు. వారితో కలిసి ముచ్చటించారు. ఆ తర్వాత ఒక డాబా వద్ద ఆగి డ్రైవర్ల సమస్యలను అడిగితెలుసుకున్నారు.

