చైనా యువతలో కొత్త ట్రెండ్ కనిపిస్తున్నది. పెద్ద మొత్తంలో జీతం లభిస్తున్నా, వైట్ కాలర్ ఉద్యోగాలను వదిలేసి చెఫ్స్, క్లీనర్స్‌గా మారిపోతున్నారు. కొత్త ఉద్యోగం వల్ల శరీరం అలసిపోయినా, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని యువతీ, యువకులు తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొంటున్నారు. కన్సల్టింగ్ ఉద్యోగం వదిలేసిన ఒక యువతి కాఫీ షాప్‌లో పని చేయడం గురించి చెప్తూ కొత్త ఉద్యోగం కొత్త శక్తిని ఇవ్వడంతోపాటు సరదాగా ఉందని చెప్పింది. కంపెనీలు తమను ఉద్యోగం కోసం కాకుండా యాంత్రికంగా పని చేయించడం కోసం తీసుకొన్నాయని యువత నిరాశ చెందుతూ ఉండొచ్చని న్యూయార్క్ యూనివర్సిటీ షాంఘై సామాజిక శాస్త్ర అధ్యాపకుడొకరు అభిప్రాయపడ్డారు.