ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నచిత్రం సలార్. ప్రభాస్ సరసన సృతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఈ చిత్రం లో ప్పథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, ఈశ్వరీరావు, జగపతిబాబు, శ్రియా రెడ్డి తదితరులు నటి స్తున్నారు. ఈ సినిమా టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారి నిరీక్షణకు తెరదించుతూ సలార్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో ప్రభాస్ రగ్గ్‌డ్ లుక్స్‌తో కనిపించారు. దర్శకుడు ప్రశాంత్‌నీల్ తన మార్క్ ఎలివేషన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సలార్ యూనివర్స్‌లో భాగంగా పార్ట్-1గా ఈ చిత్రం రానున్నట్లు టీజర్ ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

















