Skip to main content

Namaste NRI

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మూవీ ప్రారంభం

భార్గవ్‌ హీరోగా పరిచయమవుతూ దర్శకత్వం వహిస్తున్న తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బండి నాగరాజు నిర్మాత. మీనాక్షి జైస్వాల్‌, అరియా మీనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్‌నివ్వగా, కె.అశోక్‌ కుమార్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. ఈ సినిమా ద్వారా తెలుగులో తన కెరీర్‌ మొదలుపెట్టడం ఆనందంగా ఉందని, ఇదో ఆహ్లాదభరితమైన ప్రేమకథా చిత్రమని హీరో, దర్శకుడు భార్గవ్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయికృష్ణ, సంగీతం: పెద్దపల్లి రోహిత్‌, స్క్రిప్ట్‌, దర్శకత్వం: భార్గవ్‌ బి.వి.

Social Share Spread Message

Latest News