Skip to main content

Namaste NRI

ఒక గంట సమయం ఇవ్వండి.. నాకు ఆ ఫేవర్ చేయండి: మోదీ

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసే పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ప్రధానంగా రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్‌ను విశ్వగురువుగా నిలబెట్టేందుకు వచ్చే ఏడాది వ్యవధిలో కోటి మంది యువతకు ఉచిత ఏఐ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. దీనికితోడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఆర్థిక భారం తగ్గించేలా నాణ్యమైన ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే క్రీడారంగంలో భారత్ పతకాల పంట పండించడమే లక్ష్యంగా, రాబోయే ఒలింపిక్స్ మరియు కామన్వెల్త్ క్రీడలను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు బృహత్తర స్పోర్ట్స్ టాలెంట్ హంట్ చేపడుతున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.

భవిష్యత్తు సాంకేతికత మరియు స్వయంసమృద్ధి సవాలును స్వీకరిస్తూ, సెమీకండక్టర్ తయారీలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు రాబోయే ఒకట్రెండేళ్లలో 7 నుండి 8 కొత్త సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు మోదీ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 100 గిగావాట్ల (జిడబ్ల్యు) న్యూక్లియర్ ఎనర్జీ సాధించడమే ధ్యేయంగా కొత్తగా 5 అణు రియాక్టర్లను నిర్మించనున్నట్లు తెలిపారు. మారుతున్న ప్రపంచ భద్రతా సవాళ్లకు అనుగుణంగా దేశ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తూ, సైనిక దళాలకు ఆధునిక మరియు సాంకేతిక శిక్షణను అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు యువతకు అపారమైన ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక, రక్షణ రంగాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ పునరుద్ఘాటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events