Skip to main content

Namaste NRI

భారత్ అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది..ర‌ష్యా అధ్య‌క్షుడి ప్ర‌శంస‌లు

భారత్‌ సాధిస్తున్న ప్రగతిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రశంసించారు. ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ అద్భుతమైన విజయాలు సాధిస్తోందని అన్నారు. ప్రపంచ వేదికపై భారత్‌ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి పుతిన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

భారత్‌, రష్యా దేశాల మధ్య సంబంధాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాయని పుతిన్‌ చెప్పారు. ఐక్యరాజ్యసమితి, ఎస్‌సీఓ, బ్రిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ భద్రత, స్థిరత్వానికి కూడా ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని అన్నారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events