Namaste NRI

సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఘనంగా సంబురాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, మానవీయకోణంలో మునుపెన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారని బీఆర్ఎస్ క్వీన్స్‌ల్యాండ్‌ రాష్ట్ర కన్వీనర్ సాదం శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్‌లోని  భారత రాష్ట్ర సమితి శ్రేణులు ఆర్టీసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఆర్టీసీ ఉద్యోగులకు చాలా అన్యాయం జరిగిందని, వారి గోసను అర్ధం చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం హర్షణీయన్నారు. అలాగే 19 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ నిర్ణయం, పటాన్చెరు – మేడ్చల్ – తుంకుంట వరకు మెట్రోరైలు విస్తరణ నిర్ణయాన్ని కూడా అభినందిస్తూ ఆనందోత్సాహాలతో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రీకర్, విరించి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News