Skip to main content

Namaste NRI

నా పాపులారిటీతో మీకేం పని … డొనాల్డ్‌ ట్రంప్‌కు మెలోనీ కౌంటర్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. తన ప్రజాదరణను పెంచుకునేందుకు మెలోనీ జీ7 సమావేశంలో మీతో ఫొటో తీసుకుంటానంటూ కోరారని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్‌ తాజా వ్యాఖ్యలకు మెలోనీ దీటుగా కౌంటర్‌ ఇచ్చారు. నా ప్రజాదరణ గురించి మీరు పట్టించుకోవలసిన పనిలేదు. మీ ప్రజాదరణపై మీరు దృష్టి పెట్టాలని నా సలహా అంటూ స్పందించారు.

ట్రంప్‌ ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధాని మెలోనీ నాతో కలిసి ఫొటో దిగాలని పదే పదే కోరారు. ఇటలీలో ఆమె ప్రజాదరణ తగ్గడానికి కారణం ఇరాన్‌ అణ్వాయుధాన్ని పొందకుండా నిరోధించే అమెరికా ప్రయత్నాలపై ఆమె తీసుకునే వైఖరే. ఇప్పుడు ఆమె ఇటలీలో తన ప్రజాదరణను పెంచుకోవాలని భావిస్తున్నారు అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అర్థరహితమని మెలోనీ అన్నారు. తన ప్రజాదరణ అమెరికా అధ్యక్షుడితో ఉన్న సంబంధాలపై ఆధారపడి ఉందన్న వాదనను ఆమె తిరస్కరించారు. ఇటలీ ఒక సార్వభౌమ దేశంగానే కొనసాగుతున్నది. ఏది ఏమైనా నా ప్రజాదరణ గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ ట్రంప్‌కు మెలోనీ జవాబిచ్చారు.

Social Share Spread Message

Latest News