టాలీవుడ్ స్టార్ హీరో రాం చరణ్ , ఉపాసన దంపతులు తమ గారాల పట్టి క్లీంకార ఫొటోలు పంచుకున్నారు. ఈ మధ్యే రెండోసారి తల్లిదండ్రులైన ఈ జంట, ఎట్టకేలకు క్లీంకార ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఆమె మూడో పుట్టిన రోజును పునస్కరించుకొని ఇదిగో మా క్లీంకార అంటూ ఉపాసన పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరలైంది. మూడేళ్ల క్రితం జూలై 20వ తేదీన రాం చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార జన్మించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తమ పాప ముఖం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడిందీ జంట. అయితే, క్లీంకర మూడో సంవత్సరంలో అడుగుపెట్టిన రోజును మరింత ప్రత్యేకంగా మలుస్తూ, అభిమానులను సంబురాల్లో ముంచుతూ తమ కూతురి ఫొటోను పంచుకున్నారు.

చిరునవ్వులు చిందిస్తున్న క్లీంకార ఫొటో చూసినవాళ్లంతా అచ్చం అమ్మ ఉపాసనను పోలి ఉందిగా అని అనుకుంటున్నారు. ఈ మధ్యే రాంచరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చారు. కుమారుడికి శివ్‌రాం కొణిదెల, కూతురికి అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేశారు.





























