బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తోన్న చిత్రం జవాన్. షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ చివరి షాట్లో గుండుతో కనిపించిన షారుఖ్ లుక్‌ను రిలీజ్ చేస్తూ నేను మంచోడినా, చెడ్డోడినా అనేది మరో ముప్పై రోజుల్లో తెలుస్తుంది అంటూ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. చేతిలో గన్ పట్టుకుని గుండుతో ఉన్న షారుఖ్ లుక్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. అట్లీ ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులన్ని కలుపుకుని భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని, విడుదలకు ముందే సినిమాకు మూడొందల కోట్లు లాభాలు వచ్చాయని సమాచారం.














