Namaste NRI

సౌదీ గుడ్‌న్యూస్…ఆ ఎనిమిది దేశాలకు

సౌదీ అరేబియా ఎనిమిది కొత్త దేశాల పర్యాటకులకు విజిట్ వీసాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ పర్యాటక మంత్రిత్వశాఖ  తాజాగా ప్రకటన విడుదల చేసింది. అల్బేనియా, అజర్ బైజాన్, జార్జీయా, కిర్గిజ్‌స్తాన్, మాల్దీవులు, సౌతాఫ్రికా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల పర్యాటకులు ఇకపై విజిట్ వీసా పొందవచ్చని తన ప్రకటనలో పేర్కొంది.

ఆయా దేశాల పర్యాటకులు ఉమ్రా నిర్వహించడానికి, బంధువులు లేదా స్నేహితులను సందర్శించడానికి, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి కింగ్డమ్‌కి రావొచ్చని మంత్రిత్వశాఖ తెలియజేసింది. అయితే, వీసాపై నిర్ధేశించిన గడువును తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక విజిట్ వీసాదారులు  హజ్ సమయంలో ఉమ్రా చేయలేరని, వీసాల గడువు ముగిసిన తర్వాత మాత్రమే రెన్యువల్ చేయబడతాయని మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News