విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో జయరాం, సచిన్‌ఖేడేకర్, మురళీశర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య తదితరులు నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌తోపాటు నా రోజా నువ్వే, ఆరాధ్య ఖుషి అంటూ సాగే పాటలకు సోషల్‌మీడియాలో మంచి స్పందన లభిస్తున్నది. ఈ నెల 9న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌మీడియాలో వ్యూస్‌పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ట్రైలర్ కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. హృద్యమైన ప్రేమకథా చిత్రంగా అందరిని ఆకట్టుకుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అన్నారు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: జి.మురళి, సంగీతం: హిషామ్ అబ్దుల్ వాహబ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ.














