Namaste NRI

జర్మనీలో కలకలం… రెండో ప్రపంచ యుద్ధం నాటి

జర్మనీ లోని డ్యూసెల్‌డార్ఫ్‌ ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు  కలకలం రేపింది. ఒక టన్ను బరువుగల ఈ పేలుడు పదార్థాన్ని సిటీ జూ  సమీపంలో అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పేలుడు పదార్థాన్ని గుర్తించిన 500 మీటర్ల పరిధిలోని ప్రజలను హుటాహుటిన అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలోని రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు బాంబ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించి బాంబును డిస్పోజ్‌ చేసే ఆపరేషన్‌ మొదలుపెట్టారు. ఆగస్టు 7 – 8 తేదీల్లో ఈ బాంబును గుర్తించారు.  మరోవైపు బాంబు గుర్తింపుతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతం నుంచి 13,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.  రెండో ప్రపంచ యుద్ధం నాటి వేలాది బాంబులు ఇప్పటికీ జర్మనీలో అక్కడక్కడా బయటపడుతూనే ఉన్నాయి. 2017లో ఫ్రాంక్‌ఫర్ట్‌ లో 1.4 టన్నుల బరువున్న బాంబు బయటపడింది. అప్పుడు ఆ ప్రాంతం నుంచి సుమారు 65,000 మంది ఖాళీ చేయాల్సి వచ్చింది. 2021 డిసెంబర్‌లో కూడా మునిచ్ స్టేషన్  సమీపంలోని నిర్మాణ స్థలంలో రెండో ప్రపంచ యుద్ధం బాంబు పేలింది. ఆ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.

Social Share Spread Message

Latest News