Namaste NRI

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన భువనేష్ బుజాల

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డిని అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షుడు భువనేష్‌ బుజాల కలిశారు. ఇండియా పర్యటలో ఉన్న భువనేష్‌ బుజాల కిషన్‌ రెడ్డితో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులను కలువనున్నారు. 2022, జూలైలో నిర్వహించే 1-3 తేదీల్లో వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించే అమెరికా తెలుగు సంఘం 17వ మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ  సందర్భంగా భువనేష్‌ మాట్లాడుతూ తెలుగు కమ్యూనిటీకి అమెరికా తెలుగు సంఘం  చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.  కోవిడ్‌ టైమ్‌లో చేసిన ప్రత్యేక సహాయ కార్యక్రమాలను కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటా నాయకులు కూడా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News