Namaste NRI

పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మ అవార్డులు- 2026ను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలందించే వారికి ఇచ్చే పద్మ పురస్కారాల వేడుక రాష్ట్రపతి భవన్‌లో జరిగింది.

గత నెల 25న 66 మంది ప్రముఖులకు రాష్ట్రపతి అవార్డులను అందజేయగా, 47 మందికి అవార్డులు ప్రదానం చేస్తున్నారు. సినీ రంగం నుంచి ప్రముఖ తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్‌, మురళీ మోహన్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మలయాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టికి పద్మభూషణ్‌, తమిళ నటుడు ఆర్‌ మాధవన్‌లకు పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేశారు.

Social Share Spread Message

Latest News