అత్యంత పురాతన శస్త్రచికిత్స కళాశాలలో మొదటి శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుడు. భారతదేశానికి చెందిన మహర్షి సుశ్రుతుడు ఒక దార్శనిక శస్త్రచికిత్స నిపుణుడు. సుమారు 2600 సంవత్సరాల క్రితమే ఆయన 300 కి పైగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. 124 రకాల శస్త్రచికిత్స పరికరాలను ఆవిష్కరించారు. ఈ విజ్ఞానాన్ని బావితరాలకు అందించే ఉద్దేశంతో ప్రారంభంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స గ్రంథమైన సుశ్రుత సంహిత ‘ ను రచించారు.


2600 ఏళ్ల క్రితం ప్రపంచంలో చాలాబాగం శస్త్రచికిత్స శాస్త్రన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రారంభించని కాలంలో భారతదేశం అప్పటికే సుశ్రుత సంహిత ద్వారా వందలాది శస్త్రచికిత్స విధానాలు పరికరాలు పునర్నిర్మాణ పద్ధతులు వైద్య నీతిని నమోదు చేసింది. ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి చాలా కాలం ముందు సుశ్రుతుడు నుదుటి చర్మపు పొరలు ఉపయోగించి నాసిక పునర్నిర్మాణం చేసేవాడు. ఆధునిక ప్రపంచంలో వైద్య నీతి నియమ బద్ధము కావడానికి చాలా కాలం ముందే ఆయన వైద్య క్రమశిక్షణ, శస్త్రచికిత్స శిక్షణ, నీతి సూత్రాలను నిర్దేశించారు.

యూకే లో స్థిరపడిన తెలుగు శస్త్రచికిత్స నిపుణుడు ప్రొఫెసర్ చంద్ర చెరువు కృషి ఫలితంగా నేడు ప్రపంచం మొత్తం మహర్షి సుశ్రుతుడు ని ‘శస్త్రచికిత్స పితామహుడు’ గా ఏకగ్రీవంగా అంగీకరిస్తుంది. ప్రారంభంలోనే మొట్టమొదటి అతిపెద్ద శస్త్రచికిత్స సంస్థగా పేరుగాంచిన రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్ బర్గ్ (స్థాపన 1505) మహర్షి సుశ్రుతుడి 90 కిలోల కాంస్య విగ్రహాన్ని తన ప్లే ఫేయిర్ ఆడిటోరియంలో’ ఆవిష్కరించింది.విగ్రహన్ని కళాశాల అధ్యక్షురాలు క్లార్ మెక్ నాట్, భారత కౌన్సిలేట్ జనరల్ సిద్ధార్థ మాలిక్ ఆవిష్కరించారు.

ఈ విగ్రహాన్ని ప్రొఫెసర్ చంద్ర చెరువు ఆయన కుటుంబము స్థాపించిన ‘చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్ ‘ విరాళం గా అందించింది. దీనిని తిరువన్నామలై కి చెందిన శిల్పి రాఘవ నాదం స్వామిమలై రూపొందించారు.ప్రపంచానికి నిజమైన చరిత్రను తెలియచేయటం సుశ్రుతుడిని తొలి శస్త్రచికిత్స నిపుణుడిగా గౌరవించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.





























