Skip to main content

Namaste NRI

రశ్మిక మందన్న లీడ్ రోల్ ది గర్ల్ ఫ్రెండ్

రశ్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు.

ది గర్ల్ ఫ్రెండ్ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉన్నాయి. నాదీ అని చెప్పుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా అంటూ మోషన్ పోస్టర్ వాయిస్ ఓవర్ లో వచ్చిన డైలాగ్స్, రశ్మిక శ్వాసను ఆపి నీటిలో కూర్చుని ఉండటం మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు ఖుషీ ఫేమ్‌ అబ్దుల్ హేషమ్ వాహద్ స్వరాలు సమకూర్చుతున్నాడు.

Social Share Spread Message

Latest News