Namaste NRI

ఊహించని మలుపుతో కాలింగ్‌ సహస్త్ర

సుడిగాలి సుధీర్‌, డాలీషా జంటగా రూపొందుతున్న చిత్రం కాలింగ్‌ సహస్త్ర. అరుణ్‌ విక్కిరాలా దర్శకుడు. విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాలూరి నిర్మాతలు. ఈ చిత్రంలో శివబాలాజీ, మనోహరన్‌, రవితేజ సన్నిమాల తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సుధీర్‌ పాత్ర కొత్తగా ఉంటుందని, వైల్డ్‌గా, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో మాస్‌ ప్రేక్షకులకు నచ్చేలా అతని పాత్ర సాగుతుందని, ఊహించని మలుపులతో సాగే కథ ఇదని నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.  ఈ చిత్రానికి కెమెరా: సన్నిడి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events