Skip to main content

Namaste NRI

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈనెల 29 నుంచి బెయిల్‌కు అంతకుముందు ఉన్న షరతులన్నింటినీ తొలగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈనెల 28లోపు చంద్రబాబు హెల్త్ రిపోర్టును విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి సమర్పించాలని ఆదేశించింది. ఈనెల 29 నుంచి చంద్రబాబు రాజకీయ ర్యాలీల్లో నేరుగా పాల్గొనవచ్చని వెల్లడించింది. దీంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

కాగా స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో 53 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈనెల 28 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇటీవల స్కిల్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో మూడు రోజుల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరపున ఏఏజీ పొన్నవొలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు నమోదు చేశారు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబును A37గా సీఐడీ చేర్చింది.

ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, FIR క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. గత నెలలో తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. దీపావళి సెలవుల అనంతరం తీర్పు ప్రకటిస్తామని ధర్మాసనం చెప్పింది. రేపో, మపో సుప్రీం ధర్మాసనం తీర్పు ప్రకటించనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events