అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో 1900 మందిని (మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం) తొలగించాలని నిర్ణయించింది. గేమింగ్ విభాగంలోని యాక్టివిజన్ బ్లిజార్డ్, ఎక్స్ బాక్స్ డివిజన్లలోనూ కోతలుం టాయని కంపెనీ తెలిపింది. ఇది బాధాకర నిర్ణయమైనా ఆపరేషన్లను క్రమబద్ధీ కరించడానికి, కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి ఇది తప్పదని తెలిపిం ది. ఇదే సమయంలో కంపెనీలో కీలక పాత్ర పోషించిన బ్లిజార్డ్ అధ్యక్షుడు మైక్ యబ్రా, చీఫ్ డిజైనింగ్ ఆఫీసర్ అల్లెన్ అడమ్ కంపెనీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బ్లిజార్డ్కు వచ్చే వారం కొత్త ప్రెసిడెం ట్ను నియమి స్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కీలక అధికారులు సంస్థను వీడటం, సంస్థాగత మార్పు ల కారణంగా ఒక గేమ్ ప్రాజెక్ట్ను బ్లిజార్డ్ రద్దు చేసింది.