పోటీ చట్టాలను అతిక్రమించి సొంత మ్యూజిక్ సర్వీసులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా వ్యవహరించిన కేసులో టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి యూరోపియన్ యూనియన్(ఈయూ) రూ.16,500 కోట్ల భారీ జరిమానను విధించింది. తమ యాప్ బయట ప్రత్యామ్నాయ, చౌకైన సంగీత చందా సేవల గురించి ఐఓఎస్ యూజర్లకు యాప్ డెవలపర్లు సమాచారం అందించడాన్ని యాపిల్ పూర్తిగా నిషేధించిందని ఈయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చట్ట విరుద్ధం. లక్షలాది యూరోపియన్ వినియోగదారులపై ఇది ప్రభావం చూపించింది అని ఈయూ కాంపిటీషన్ కమిషనర్ వ్యాఖ్యానించారు.