అమెరికాలోని టీసీఎస్ జాతి, వయసు ఆధారంగా వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆ కంపెనీ నుంచి తొలగింపునకు గురైన 22 మంది ఉద్యోగులు ఆరోపించారు. హెచ్-1బీ వీసాలు గల భారతీయ వర్కర్ల కోసం తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై వివక్ష ప్రదర్శిస్తూ, ఇండియన్ వర్కర్లకు ప్రాధాన్యమిస్తూ, ఈ కంపెనీ చట్టాలను ఉల్లంఘిస్తున్నదని మండిపడ్డారు. వీరిలో కాకసియన్స్, ఆసియన్-అమెరికన్స్, హిస్పానిక్ అమెరికన్స్ ఉన్నారు. ఆరోపణలను టీసీఎస్ ఖండించింది.