బ్రెజిల్ సుప్రీంకోర్టు జడ్జి, బిలియనీర్ ఎలన్ మస్క్ మధ్య వార్ నడుస్తోంది. కొన్ని అకౌంట్లను బ్లాక్ చేయాలని ఇటీవల బ్రెజిల్ సుప్రీం జడ్జి ఆదేశించారు. ఆ కేసులో దర్యాప్తునకు కూడా ఆ జడ్జి ఆదేశించారు. అయితే ఆ ఎక్స్ అకౌంట్లను రియాక్టివేట్ చేయనున్నట్లు మస్క్ ప్రకటించారు. దీంతో ఆ ఇద్దరి మధ్య ఫైట్ మొదలైంది. భావస్వేచ్ఛను అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపించారు. దేశంలోని కొన్ని ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేయాలని జడ్జి అలెగ్జాండ్రే డీమోరల్స్ ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని, ఆ అకౌంట్లపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేస్తానని, జడ్జి మోరేల్స్ రాజీనామా చేయాలని మస్క్ డిమాండ్ చేశారు. అయితే ఇంతకీ ఏయే ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేశారన్న అంశాన్ని ఇప్పటి వరకు బ్రెజిల్ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ వెల్లడించలేదు.