మహిళల పక్కనే విమాన సీటు బుకింగ్ చేసుకునే అవకాశాన్ని మహిళలకు కల్పించింది దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో. ఇందుకోసం ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ. ఇప్పటికే మహిళలు బుకింగ్ చేసుకున్న సీటు పక్కనే మరో మహిళ సీటు బుకింగ్ చేసుకునే విధంగా ఈ ఫీచర్ పనిచేయనున్నదని తెలిపింది. మహిళా ప్రయాణికులకు సౌకర్యవంతంగా తమ ప్రయాణ అనుభవాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వెబ్ చెక్- ఇన్ సమయంలో మాత్రమే మహిళా ప్రయాణికులు బుక్ చేసుకున్న సీట్ల పక్కనే బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.