అమెరికా మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ డెల్ భారీ ఎత్తున ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. కంపెనీ మొత్తం సిబ్బందిలో 10శాతం మందిని ఇంటికి పంపేందుకు కార్యాచరణ చేపట్టినట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఇకపై కంపెనీ కృత్రిమమేధపై ఎక్కువగా దృష్టిసారించనుంది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కంపెనీకి చెందిన 12,500 మంది సిబ్బందిపై వేటు పడబోతున్నది.
కంపెనీలోని సేల్స్ బృందాలు, మార్కెటింగ్, ఆపరేషన్ విభాగాల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించబోతున్నారట.. అమెరికాలోని టెక్సాస్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన డెల్, పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్లు, స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ మొదలైన వాటిని ఉత్పత్తి చేస్తున్నది. కంపెనీలో ప్రస్తుతం లక్షా 20 వేల మంది వరకు ఉద్యోగులున్నారు.