Skip to main content

Namaste NRI

జపాన్‌ యానిమేటర్‌కు రామన్‌ మెగసెసె అవార్డు

ఆసియన్‌ నోబెల్‌ ప్రైజ్‌గా భావించే రామన్‌ మెగసెసె అవార్డు 2024 సంవత్సరానికిగానూ ప్రముఖ జపాన్‌ యానిమేటర్‌ హయావో మియాజాకీని వరించింది. ఆయన స్పిరిటెడ్‌ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రశంసలు పొందారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తామని అవార్డు నిర్వాహక కమిటీ తెలిపింది. మరో ముగ్గురు వ్యక్తులకు, ఒక సంస్థకు ఈ అవార్డు దక్కింది.  వియత్నాం డాక్టర్‌ న్గుయెన్‌, మాజీ బౌద్ధ సన్యాసి కర్మ ఫుంట్‌షొ, ఇండోనేషియాకు చెందిన ఫర్విజీ ఫర్హాన్‌కు అవార్డు లభించింది. అలాగే థాయ్‌లాండ్‌కు చెందిన రూరల్‌ డాక్టర్స్‌ మూమెంట్‌ సంస్థకు కూడా పురస్కారం దక్కింది.

Social Share Spread Message

Latest News