Namaste NRI

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎల‌న్ మస్క్.. ఆ తర్వాత

స్పేస్ ఎక్స్‌, టెస్లా కంపెనీ సీఈవో ఎల‌న్ మ‌స్క్‌ ప్ర‌పంచంలోనే తొలి ట్రిలియ‌నీర్‌గా నిల‌వ‌నున్నారు. 2027 నాటికి ఆయ‌న ట్రిలియ‌న్ డాల‌ర్లు క‌లిగిన వ్య‌క్తిగా రికార్డుల్లోకి ఎక్క‌నున్న‌ట్లు తెలిసింది.  ప్ర‌తి ఏడాది మ‌స్క్ ఆదాయం పెరుగుతున్న గ‌ణాంకాల ఆధారంగా ఈ అంచ‌నా వేశారు. మ‌స్క్ వార్షిక సంప‌ద వృద్ధి సుమారు 109.88గా ఉన్న‌ట్లు భావిస్తున్నారు. మ‌స్క్‌ ప్ర‌స్తుతం 237 బిలియ‌న్ల డాల‌ర్ల‌తో ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న వ్య‌క్తిగా మొద‌టి స్థానంలో నిలిచారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌స్క్  ఆరు కంపెనీల‌కు ఫౌండ‌ర్‌గా ఉన్నారు. ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా, స్పేస్ ఎక్స్ దీంట్లో ఉన్నాయి. టెస్లా కంపెనీ మార్కెట్ విలువ 669.28 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్న‌ది. ఆ కంపెనీ విలువ ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు వ‌చ్చే ఏడాది చేరే అవ‌కాశాలు ఉన్నాయి.

ప్ర‌పంచ సంప‌న్నుల్లో ట్రిలియ‌నీర్లు కాబోనున్న ఇత‌ర‌ వ్యాపార‌వేత్త‌ల‌ను కూడా అంచనా వేశారు. ట్రిలియ‌నీర్ క్ల‌బ్‌లో చేర‌నున్న వారిలో భార‌తీయ వ్యాపారి గౌత‌మ్ అదానీ కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో ఎన్విడి యా సీఈవో జెన్‌సెన్ హువాంగ్‌, ఇండోనేషియా మ్యాగ్నెట్ ప్ర‌జోగో పంగెస్టు కూడా ఉన్నారు. 2028 వ‌ర‌కు ఈ ముగ్గురూ ట్రిలియ‌నీర్లు అయ్యే ఛాన్సు ఉంది.   ఫ్రెంచ్ వ్యాపార‌వేత్త, లూయిస్ విట్టాన్ ఓన‌ర్ బెర్నార్డ్ అర్నాల్ట్‌,  2030 వ‌ర‌కు ట్రిలియ‌నీర్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress